‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి ఈ వివాదంపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. శివాజీ ఉపయోగించిన కొన్ని పదాలు తప్పు కావచ్చని, ఆ విషయాన్ని స్వయంగా శివాజీ కూడా అంగీకరించి క్షమాపణలు చెప్పారని రక్షిత్ గుర్తు చేశారు. అయితే, ఆ మాటల వెనుక ఉన్న ‘ఉద్దేశాన్ని’ (Intention) గమనించాలని ఆయన కోరారు. శివాజీ చెప్పాలనుకున్న మూల భావనలో తప్పేమీ లేదని, మహిళల భద్రత పట్ల ఉన్న ఆందోళనతోనే ఆయన అలా మాట్లాడారని రక్షిత్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలాంటి దుస్తులు ధరించినా భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని రక్షిత్ సూచించారు. కుటుంబాలు తమ పిల్లల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మహిళలను గౌరవించడం మరియు రక్షించడం పురుషులుగా మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. శివాజీ మాటలను కేవలం వస్త్రధారణ కోణంలోనే కాకుండా, సామాజిక భద్రత కోణంలో అర్థం చేసుకోవాలని రక్షిత్ అట్లూరి కోరారు.









