మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంపై పద్ధతి ప్రకారం ‘బుల్డోజర్’ నడుపుతోందని ఆమె శనివారం ఆరోపించారు. లోక్‌సభలో ఇటీవల ఆమోదం పొందిన ‘వీబీ-జీ రామ్ జీ’ (VB-G RAM G) బిల్లు 2025 ద్వారా గ్రామీణ పేదలు, కూలీల హక్కులను కాలరాస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ కొత్త చట్టాన్ని ‘నల్ల చట్టం’గా అభివర్ణించిన ఆమె, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) హయాంలో సుమారు 20 ఏళ్ల క్రితం తాము తీసుకువచ్చిన ఈ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో వలసలను ఆపి కోట్లాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిందని సోనియా గుర్తుచేశారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఈ పథకం నిరుపేదలను ఆదుకున్న తీరును ఆమె కొనియాడారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉపాధి హామీ స్వరూపాన్ని మార్చివేసి, చివరకు పథకం నుండి ‘మహాత్మా గాంధీ’ పేరును కూడా తొలగించడం జాతిపితను అవమానించడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పనిదినాలను 125 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం చెబుతున్నా, అంతర్గతంగా నిధులను తగ్గించి రాష్ట్రాలపై భారాన్ని నెట్టేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త ‘వీబీ-జీ రామ్ జీ’ బిల్లు ప్రకారం, ఉపాధి హామీ పథకం ఇకపై పూర్తిగా కేంద్ర నిధులతో కాకుండా, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో నిధుల భాగస్వామ్యంతో అమలు కానుంది. దీనివల్ల పేద రాష్ట్రాలపైన, గ్రామీణ పంచాయతీలపైన తీవ్ర ఆర్థిక భారం పడుతుందని సోనియా గాంధీ ఆరో









