మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ/MGNREGA) పేరు మార్పుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు అంశాలు అసలే గిట్టవని ఆయన విమర్శించారు. ఒకటి రాహుల్ గాంధీ ఆలోచనలు, రెండోది పేదల హక్కులు అంటే ఆయనకు ఇష్టం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
గాంధీజీ గ్రామ స్వరాజ్యం ఆలోచనలకు ప్రతిరూపమే గ్రామీణ ఉపాధి హామీ పథకమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అలాంటి పథకం పేరు మార్పు బిల్లు మహాత్మా గాంధీ ఆలోచనలకు అవమానమని ఆయన అభివర్ణించారు.
2014 నుంచి ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.









