హీరోయిన్ రాశీ సింగ్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తన కాలేజీ లెక్చరర్‌తో ప్రేమలో పడ్డానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘3 రోజెస్’ సీజన్ 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రాశీ సింగ్ మాట్లాడుతూ, ఆ లెక్చరర్ తనకు బాయ్‌ఫ్రెండ్‌గా ఉంటూ, పరీక్షల సమయంలో తనకు ఎంతో ఫేవర్ చేసేవాడని, క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చేవాడని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
తన కాలేజీ లవ్ స్టోరీ గురించి వివరిస్తూ, “ఆయన మా లెక్చరర్ కూడా. నాకు ఎంతో ఫేవర్ చేసేవాడు. పరీక్షల టైంలో నాకు క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చేవాడు. వైవా టైంలో ఏం అడిగేవాడు కాదు. ఇద్దరం కూర్చుని 10 నిమిషాలు టైం పాస్ చేసేవాళ్లం. నన్ను ఏమీ అడిగేవారు కాదు. అప్పుడు నా వయస్సు 17 ఏళ్లు. అతను చాలా యంగ్. కానీ ఏం అవ్వలేదు. ఇప్పుడు అతనికి పెళ్లి అయిపోయింది. నన్ను ఇన్‌స్టాలో కూడా ఫాలో అవుతున్నాడు” అని తెలిపారు. ఆమె చేసిన ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
అయితే, రాశీ సింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ, ఒక సెలబ్రిటీగా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా, ప్రమోషన్ల కోసం ఇలాంటి విషయాలను మాట్లాడటం కరెక్ట్ కాదని, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండాల్సిన నైతిక విలువలను ఆమె కామెంట్స్ దెబ్బతీస్తున్నాయని విమర్శలు చేస్తున్నారు. కాగా, రాశీ సింగ్ ‘శశి’, ‘ప్రసన్న వదనం’, ‘పాంచ్ మినార్’ వంటి సినిమాల్లో నటించి, ప్రస్తుతం ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ సీజన్ 2లో కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్ డిసెంబర్ 12 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.









