చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ క్రికెటర్, భారత క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచారి తనయుడు అనిరుధ్ శ్రీకాంత్, తమిళ నటి మరియు బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్‌ను వివాహం చేసుకున్నారు. గురువారం (నవంబర్ 27) చెన్నైలో అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
అనిరుధ్ శ్రీకాంత్ భారత దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా మారిన అనిరుధ్, గతంలో ఆర్తి వెంకటేష్‌ను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు.
నటి సంయుక్త షణ్ముగనాథన్ మోడల్‌గా, తమిళ బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె విజయ్ నటించిన ‘వారిసు’ సహా పలు చిత్రాల్లో నటించారు. సంయుక్త కూడా గతంలో ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌ను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీరి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









