UPDATES  

NEWS

 తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం: భక్తుల మనోభావాలపై ఆటలాడొద్దు – పవన్ కల్యాణ్

తిరుమలలో కల్తీ నెయ్యి ఉపయోగంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. మాజీ వైసీపీ ప్రభుత్వం మరియు అప్పటి టీటీడీ బోర్డు పనితీరును ఆయన తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని లోపం చేస్తూ వ్యవహరించారని, వారు భక్తుల నమ్మకాన్ని ఒక అవకాశంగా మలచుకున్నారని ఆయన ఆరోపించారు.

తిరుమల సాధారణ ఆలయం కాదు; కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రం,” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన విశ్వాసం దుర్వినియోగమైందని, దాంతో ప్రతి భక్తుడూ నష్టపోయాడని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్యుల దగ్గర నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ఉన్నత పదవుల వ్యక్తులు కూడా దర్శించుకునే పవిత్ర క్షేత్రంలో ఇటువంటి లోపాలు జరగడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో 2019 నుండి 2024 మధ్య కాలంలో తిరుమలలో సుమారు 10.97 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని గుర్తుచేశారు. అంటే రోజుకు సగటున 60 వేల పైచిలుకు మంది తిరుమల చేరుకున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలు పెట్టిన నమ్మకాన్ని పగులగొట్టిందని, భక్తుల మనసులను బాధించేలా పనిచేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |