UPDATES  

NEWS

 ఫార్ములా-E కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్: ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ **కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)**కు ఊహించని షాక్ తగిలింది. ఫార్ములా-E కార్ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 54 కోట్ల రూపాయల ప్రభుత్వ నగదు బదిలీకి కేటీఆర్ ప్రమేయం ఉందనే అభియోగాలతో ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. గతంలో కేటీఆర్ ఈ కేసును ‘లొట్టపీసు కేసు’గా కొట్టిపారేశారు.

ఈ కేసులో విచారణకు అనుమతివ్వాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. అభ్యర్థనను పరిశీలించిన గవర్నర్, కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ (న్యాయపరమైన విచారణ) నిర్వహించడానికి అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఖాయమని కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గతంలో ఓటుకు నోటు కేసు నమోదు చేసిన నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ కేసును ఉపయోగించి, కేటీఆర్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ అనుమతితో ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |