టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky) సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్ ఆకట్టుకోగా, టీజర్ నవ్వులు పూయించింది. “అన్ లిమిటెడ్ లాఫర్, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్ లిమిటెడ్ ఫన్” అంటూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘ఫంకీ’ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2026, ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఎంటర్టైన్ చేసే విశ్వక్ సేన్, ఈ సినిమాలో దర్శకుడి రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. న్యూ లుక్, న్యూ యాటిట్యూడ్‌తో ఆయన డైలాగులు, కామెడీతో మరోసారి ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు సిద్ధమయ్యారు.
ఈ చిత్రంలో విశ్వక్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు, ఆమె మూవీలో ప్రొడ్యూసర్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో నరేష్, మురళీధర్ గౌడ్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.









