ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో నవంబర్ 2న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఆస్ట్రేలియా లాంటి పటిష్ఠమైన జట్టును సెమీస్‌లో ఓడించి కాన్ఫిడెంట్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన, ఫైనల్ లాంటి బిగ్ మ్యాచ్‌లో టీమ్ కాంబినేషన్‌ను మార్చే అవసరం లేదని మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించడమే సరైన నిర్ణయమని ఆమె పేర్కొంది.
సెమీస్‌లో గెలిచిన జట్టునే ఫైనల్‌లో కొనసాగించడానికి ప్రధాన కారణం, ఆ మ్యాచ్‌లో టీమ్ చేసిన మార్పులు కలిసి రావడమే. గాయం నుంచి కోలుకున్న షఫాలీ వర్మ కేవలం 10 రన్స్ చేసి త్వరగా అవుట్ అయినా, ఆమెను తప్పించే అవకాశం చాలా తక్కువ. సౌత్ ఆఫ్రికా జట్టు స్పిన్ బౌలింగ్‌లో ఎక్కువగా వికెట్స్ కోల్పోవడం ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్. దీంతో, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు (రాధా యాదవ్, శ్రీ చరణి)ని కొనసాగించడం సరైన వ్యూహం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫైనల్ కోసం అంజుమ్ చోప్రా సూచించిన ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఐదుగురు బ్యాటర్స్, నలుగురు బౌలర్స్, ఇద్దరు ఆల్‌రౌండర్లతో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, ఫినిషర్ రోల్‌లో రిచా ఘోష్ ఉన్నారు. బౌలింగ్ అటాక్‌లో ముగ్గురు స్పిన్నర్లు (దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి), ఇద్దరు పేసర్లు (రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్) ఉన్నారు. ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంది. సెమీస్‌లో జెమీమా రోడ్రిగ్స్ సెంచరీ, స్పిన్నర్ల కీలక పాత్ర ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్.









