ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన అందమైన కథానాయికలలో భాగ్యశ్రీ బోర్సే ప్రముఖంగా కనిపిస్తున్నారు. పాలరాతి శిల్పంలా, కలువల్లా విచ్చుకున్న కళ్లతో కనిపించే ఈ గ్లామర్ క్వీన్‌కి తొలి సినిమా నుంచే అభిమానుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఆమె నటించిన తొలి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ, యూత్ హృదయాలపై ఆమె వేసిన గాఢమైన ముద్ర కారణంగా ఆ పరాజయాలు ఆమె కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం భాగ్యశ్రీ తమిళంలో దుల్కర్ సల్మాన్ జోడీగా ‘కాంత’, తెలుగులో రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ రెండు సినిమాలు అతి తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ‘కాంత’ చిత్రం నవంబర్ 14వ తేదీన విడుదలవుతుండగా, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘కాంత’ సినిమా 1950లలో నడిచే కథ కావడం వలన ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పీరియాడిక్ లుక్‌లో భాగ్యశ్రీ కొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌కు ఖచ్చితంగా సహాయపడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు.
మరోవైపు, రామ్ పోతినేని సరసన నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో కూడా భాగ్యశ్రీ పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇలా అతి తక్కువ గ్యాప్‌లో ఒకదాని తరువాత ఒకటిగా విడుదలవుతున్న ఈ రెండు సినిమాలు, ఆమె కెరీర్ గ్రాఫ్‌ను ఏ మేరకు పెంచుతాయో, ఏ స్థాయిలో ఆమెకు విజయాలను అందిస్తాయో చూడాలని సినీ ప్రేక్షకులు మరియు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.









