‘ఓజీ’ (OG) సినిమాతో బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చి అభిమానుల అంచనాలను అందుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవన్‌ను కలిసి సినిమా కోసం డేట్స్ అడిగాడని, మంచి కథ దొరికితే చేస్తానని పవన్ మాట ఇచ్చాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లిని ఫైనల్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మెసేజ్ ఓరియెంటెడ్ కథలను తెరకెక్కించడంలో వంశీ పైడిపల్లికి మంచి పేరు ఉన్నందున, ఆయన చెప్పిన కథ పవన్ కల్యాణ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడట.
అయితే, పవన్ కల్యాణ్ సినిమాకు వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ఎంపిక చేయడంపై పవన్ ఫ్యాన్స్ కాస్తా నిరాశలో ఉన్నారు. గతంలో విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘వారసుడు’ సినిమాపై విడుదల సమయంలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ సినిమా ‘సీరియల్’ లా ఉందని విమర్శలు వచ్చాయి. వంశీ పైడిపల్లితో పవన్ సినిమా చేస్తే, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అందుకే, సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ “దయచేసి డైరెక్టర్‌ను మార్చండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓజీ లాంటి మాస్ హిట్ తర్వాత, మళ్లీ పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు సరిపోయే దర్శకుడితో సినిమా చేయాలని వారు కోరుకుంటున్నారు. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను లాక్ చేసే ముందు, ఫ్యాన్స్ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తారో చూడాలి.









