UPDATES  

NEWS

 ‘మొంథా’ తుఫాన్ భయం: ఏపీలో రెడ్ అలర్ట్, 43 రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి ‘మొంథా’ తుఫాన్‌గా రూపాంతరం చెందడంతో ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాను ప్రభావం, ప్రయాణికుల భద్రత దృష్ట్యా, ఈస్ట్‌ కోస్ట్ రైల్వే (East Coast Railway) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే మొత్తం 43 రైళ్ల సర్వీసులను అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ప్రయాణానికి ముందు తమ ట్రైన్‌ స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.

ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మి, తుఫాను తీవ్రతను బట్టి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచనలు అందాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |