నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది. ‘మనం చిన్న బ్రేక్ తీసుకుందామా..’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లో దీక్షిత్ శెట్టి రష్మిక బాయ్‌ఫ్రెండ్‌గా కనిపించారు.
‘యానిమల్’, ‘పుష్ప 2’ వంటి భారీ విజయాల తర్వాత రష్మిక నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
వరుస కమర్షియల్ హిట్ల తర్వాత రష్మిక చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Post Views: 23









