ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన భారత్, సిరీస్‌ను సమం చేయడమే లక్ష్యంగా గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డేకు సిద్ధమైంది. తొలి వన్డేలో పదేపదే వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదించారు. అయితే, అడిలైడ్‌లో జరిగే రెండో వన్డేకు ముందు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించేందుకు దాదాపుగా అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
అడిలైడ్ ఓవల్ క్రికెట్ మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మ్యాచ్ రోజు దాదాపుగా వర్షం కురవకపోవచ్చని వెల్లడైంది. దీంతో ఫ్యాన్స్ పూర్తి 50 ఓవర్ల ఆటను సజావుగా వీక్షించే అవకాశం ఉంది. సిరీస్‌లో నిలబడాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
పెర్త్ పిచ్‌తో పోలిస్తే, అడిలైడ్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, తొలి వన్డేలో తక్కువ స్కోర్లకే అవుటైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి భారత బ్యాటర్లు ఈ పిచ్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో భారత్ వాషింగ్టన్ సుందర్ ప్లేసులో కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి.









