UPDATES  

NEWS

 SSMB29 ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ లాంచ్‌కి రంగం సిద్దం..! గ్రాండ్‌ ఈవెంట్‌ ప్లాన్‌..!

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం SSMB29. మహేష్‌ బాబు 29 సినిమాగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా ఇండియన్‌ మూవీ లవర్స్‌ మాత్రమే విదేశీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఇంటర్నేషనల్‌ స్థాయిలో జక్కన్న గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆయన మేకింగ్‌ స్టైల్‌, విజన్‌కి హాలీవుడ్‌ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. దీంతో జక్కన్న సినిమా అంటే ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు హాలీవుడ్‌లోనూ అంచనాలు నెలకొన్నాయి.

 

జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు..

ఇప్పటి వరకు పాన్‌ ఇండియాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన జక్కన్న ఈసారి పాన్‌ వరల్డ్‌ అంటూ మహేష్‌ని ఇంటర్నేషనల్‌ స్థాయిలో పరిచయం చేయబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్‌,అడ్వెంచర్‌గా రాబోతోంది. ఇప్పటికే 20 నుంచి 30 శాతం షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం నుంచి ఇంతవరకు ఆఫీషియల్‌గా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. పూజ కార్యక్రమం నుంచి షూటింగ్‌ వరకు అన్ని విషయాల్లో జక్కన్న గొప్యత పాటిస్తున్నారు. మూవీ ఇంతవరకు మహేష్‌ లుక్‌ కూడా బయటకు రాలేదు. ఈ క్రమంలో ఈ నవంబర్‌లో SSMB29 నుంచి ఫస్ట్‌ టైం ఆఫీషియల్‌గా బిగ్‌ అప్‌డేట్‌ రాబోతోంది. అదే మూవీ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు మహేష్‌ లుక్‌ని విడుదల చేయబోతున్నారు.

 

RFCలో గ్రాండ్ ఈవెంట్!

‘అవతార్‌ 3′ మూవీ రిలీజ్‌ సందర్భంగా ప్రమోషన్స్‌ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్‌ దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ చేతుల మీదుగా మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ లాంచ్‌ని ప్లాన్‌ చేసింది మూవీ టీం. ఈ క్రమంలో నవంబర్‌ 16న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి రామోజీ ఫిలిం సిటీ వేదిక కానుంది. SSMB29 టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ ఈవెంట్‌ని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్‌ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి అక్కడ గ్రాండ్‌ ఏర్పాట్లు చేస్తున్నారట. నవంబర్‌ 16న రామోజీ ఫిలం సిటీలో ఈవెంట్‌ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. హమ్మయ్య ఎట్టకేలకు SSMB29 నుంచి అసలు సిసలు అప్‌డేట్‌ రాబోతుందని, అప్పటి వరకు వెయిట్‌ చేయలేపకపోతున్నామంటూ అత్యుత్సాహం చూపిస్తున్నారు ఫ్యాన్స్‌.

 

కాగా SSMB29 మూవీ ఇప్పటికే పలు షెడ్యూల్లను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓరిస్సా అడివిలో మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ జరుపుకుంది. అలాగే అమెజాన్‌ అడవుల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికా షెడ్యూల్‌కి మూవీ టీం సిద్దమవుతుంది. త్వరలో అక్కడ కొత్త షెడ్యూల్‌ని మొదలు పెట్టనున్నారట. ఇదిలా ఉంటే SSMB29 మూవీకి సంబంధించిన టైటిల్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వారణాసి అనే టైటిల్‌ని పరీశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎంతో ప్రెస్టిజియస్‌ ప్రాజెక్ట్‌కి ఇంత సింపుల్‌ టైటిల్‌ ఏంటి అంటూ నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. మరి ఇది నిజమా? కాదా తెలియాలంటే నవంబర్‌ 16 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |