UPDATES  

NEWS

 బీహార్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం… 17 కొత్త సంస్కరణలకు శ్రీకారం..

దేశ ఎన్నికల నిర్వహణలో సరికొత్త అధ్యాయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) శ్రీకారం చుట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఒక ప్రయోగశాలగా మార్చి, ఏకంగా 17 కీలక సంస్కరణలను అమలు చేయనుంది. ఈ ఎన్నికల ఫలితాలతో పాటు, ఇక్కడ అమలు చేస్తున్న సంస్కరణల విజయవంతం ఆధారంగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ వీటిని అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టింది.

 

బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు, ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో దేశానికి ఒక మార్గాన్ని చూపుతాయి” అని పేర్కొన్నారు.

 

అమల్లోకి రానున్న కీలక సంస్కరణలు ఇవే..

 

ఈసీ ప్రకటించిన 17 సంస్కరణల్లో ఓటర్లు, సిబ్బంది, రాజకీయ పార్టీలకు సంబంధించిన అనేక మార్పులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

 

వంద శాతం వెబ్‌కాస్టింగ్: పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు.

 

వీటితో పాటు, బీఎల్‌ఓలకు ప్రత్యేక శిక్షణ, గుర్తింపు కార్డులు, స్పష్టమైన ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లు, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల అవతల అభ్యర్థులు బూత్‌లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి వంటి అనేక మార్పులను ఈసీ తీసుకొచ్చింది. ఈ సంస్కరణలన్నీ బీహార్‌లో విజయవంతమైతే, త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇవి అమలు కానున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |