UPDATES  

NEWS

 బాహుబలి ది ఎపిక్ లో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న..?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలలో బాహుబలి (Bahubali)సినిమా ఒకటి. అప్పటివరకు తెలుగు సినిమాలు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.

 

రీ రిలీజ్ కు సిద్ధమైన బాహుబలి ..

ఇకపోతే త్వరలోనే బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరుతో ఒక సినిమాగా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 31వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

 

బాహుబలి 3 గురించి ప్రకటన..

బాహుబలి ది ఎపిక్ సినిమా క్లైమాక్స్ లో రాజమౌళి పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి 3 (Bahubali 3)గురించి ది ఎపిక్ క్లైమాక్స్ లో ప్రకటించబోతున్నారనే వార్త వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ పుకార్లలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అక్టోబర్ 31వ తేదీ వరకు మనం ఎదురు చూడాల్సిందే.

 

రీ రిలీజ్ పనులలో రాజమౌళి..

 

ఇక బాహుబలి ది ఎపిక్ సినిమా విషయానికి వస్తే రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో కొన్ని అదనపు సన్నివేశాలను జోడించినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు కూడా చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో టీజర్ వీడియో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక రాజమౌళి ఈ సినిమా రీ రిలీజ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ,రమ్యకృష్ణ, సత్యరాజు వంటి నటీనటులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |