UPDATES  

NEWS

 రెండు పార్ట్ లుగా ఓజి..?

మరికొన్ని గంటల్లో ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కొత్త అవతారం ఎత్తారు. 90’sలో ఖుషి,బద్రి, తమ్ముడు వంటి చిత్రాతలతో లవర్‌ బాయ్‌గా యువతను ఉర్రూతులిగించిన పవన్‌.. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో ఎమోషన్‌ పండించారు. జానర్‌ ఏదైనా పవన్‌ పాత్రకు ప్రత్యేకమైన శైలీలో, స్టైల్‌ ఉంటుంది. రోటిన్‌ కథలైన.. పవన్‌ తనదైన మ్యానరిజం, స్టైల్‌తో ఆకట్టుకుంటాడు. గబ్బర్‌ సింగ్‌, గబ్బర్‌ సింగ్ 2 పోలీసు పాత్రలతోనూ ట్రెండ్‌ సెట్‌ చేశారు.

 

ఫస్ట్ టైం పవన్ అలా..

ఏలాంటి పాత్ర పవన్‌కి తనకుఆప్ట్‌ అయ్యేలా మేకోవర్‌ అవుతుంటారు. నటుడిగా ఆయనలో ఉన్న ఇది స్పెషల్‌ క్యాలిటీ అని చెప్పాలి. అయితే ఆయన కటౌట్‌కి తగ్గట్టు జానర్‌ ఇప్పటి వరకు రాలేదు. నిజానిక పవన్ కటౌట్‌కి గ్యాంగ్‌స్టర్‌ రోల్స్‌ బాగా సెట్‌ అవుతాయి. ఇప్పటి వరకు ఏ దర్శకుడి పవన్‌ అలా చూపించే ప్రయత్నం చేయలేదు. కానీ, ఫస్ట్‌ సుజీత్‌ పవన్‌ని ఓజీలో అలా చూపించబోతున్నాడు. ఓజీలో తన పాత్ర పవన్‌కి సైతం ఫుల్‌గా నచ్చేసిందట. అందుకే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సుజీత్‌ చెప్పినదానికి అడ్డు చెప్పకుండ పవన్‌ తూ.చ పాటించాడు. స్టేజ్‌పై కూడా ఆయన ఫుల్‌ జోష్‌ లో కనిపించారు.

 

సుజీత్ సినిమాటిక్ యూనివర్స్..

ముఖ్యంగా సినిమాకు ఇంత హైప్‌ రావడానికి పవన్‌ కూడా ఒక కారణమే. గ్యాంగ్‌స్టర్‌గా ఆయన లుక్‌కి భారీ రెస్పాన్స్‌ వస్తుంది. ఫ్యాన్స్‌ పవన్‌ ఎలా చూడాలని అనుకుంటున్నారో.. సుజీత్‌ ఓజీని అలా డిజైన్‌ చేశాడనడంలో సందేహం లేదు. సాహో చిత్రంలో సుజీత్‌ ఒక్కసారిక టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ గా మారాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ని పోలీసు ఆఫీసర్‌ పాత్రలో చూపించినట్టే చూపించి.. చివరిలో గ్యాంగ్‌స్టర్‌ని చేశాడు. ఫుల్‌ అవుట్‌ అండ్‌ యాక్షన్‌ గా సాగిన ఈ చిత్రం మాస్‌, యాక్షన్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఓజీ కూడా అదే తరహాలో ఉండబోతోంది. ఆ సినిమా మైనింగ్‌ని అయితే.. ఇక్కడ గ్యాంగ్‌స్టర్‌గా గన్స్‌ తో యుద్దం చేయబోతున్నాడు.

 

రెండు చిత్రాల్లో కామన్‌ పాయింట్‌ ఏంటంటే.. గన్స్‌ వాడకం. సాహో ప్రభాస్‌.. ఓజీలో పవన్‌ ఇద్దరు గన్స్‌ వాడారు. ఈ రెండు సినిమాలను చూస్తుంటే.. ప్రశాంత్‌ వర్మ , ప్రశాంత్‌ నీల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లా.. సుజీత్‌ కూడా తన పేరుతో ఓ మూవీ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడనిపిస్తోంది. సాహో, ఓజీలు ఒకదానికి ఒకటి లింగ్‌ ఉండబోతుందట. సాహోలో ప్రభాస్‌ని ఇంటర్నేషనల్‌ గ్యాంగ్‌స్టర్‌గా చూపించాడు. ఓజీ పవన్‌ని ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఓజీని కూడా ఇంటర్నేషనల్‌కు తీసుకువెళ్లి.. దీనికి పార్ట్‌ కూడా ప్లాన్‌ చేశాడట. అయితే పార్ట్‌లో పవన్‌ హీరో కాదట. ఒకవేళ అంత సెట్‌ అయితే అకీరా నందన్‌ హీరోగా ఇండస్ట్రీలోకి పరిచయం చేస్తూ.. ఓజీకి సీక్వెల్‌ తీసే ప్లాన్‌లో ఉన్నాడట సుజీత్‌.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |