కొమరం భీం ఆశయ సాధన కోసం పోరాడుతాం : తుడుం దెబ్బ మండల అధ్యక్షులు నరసింహారావు
వేదిక న్యూస్ గుండాల:- ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీం ఆశయ సాధన కోసం పోరాడుతామని తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు అన్నారు. కొమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క ఆదివాసి కృషి చేయాలని అన్నారు. గురువారం ఆయన 84వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం ముందు జెండా ఎగరవేసి నివాళులు అర్పించారు. నైజాం దురాగతాలకు వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాడి ఎదురొడ్డి నిలుచున్నారని అన్నారు. చిన్ననాటి నుండి ఉద్యమం చేపట్టి జల్ జమీన్ జంగిల్ అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజాం పాలకులపై పోరాడి ఎదురు నిలిచాడని అన్నారు. అలాంటి మహనీయుడి ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుంపిడి వెంకటేశ్వర్లు. మాజీ ఎంపీపీ న్యూ డెమోక్రసీ నాయకులు ముక్తి సత్యం,; వాజ్జ ఎర్రయ్య, కాంగ్రెస్ నాయకులు ఈసం పాపారావు, ప్రజా బంధ నాయకులు శంకరన్న, న్యూ డెమోక్రసీ నాయకులు సీతారాములు, ఈసం కృష్ణ, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, పూనెం శ్రీను, మోకాళ్ళ కన్నయ్య, సాంబయ్య, చింత వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు