UPDATES  

NEWS

 ‘దర్గా లేదు, దేవాలయం లేదు ప్రజల భద్రతే ముఖ్యం’.. సుప్రీం కోర్టు కీలక తీర్పు..!

రోడ్లు, రైలు మార్గాలు, నది జలాల పరిసరాల్లో స్థలాలు ఆక్రమించుకొని దేవలాయాలు, దర్గాలు లాంటి మతపరమైన కట్టడాలు నిర్మిస్తే.. వాటిని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది.. ప్రజల భద్రత ప్రాముఖ్యం కంటే ఏదీ ఎక్కువ కాదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఇండియా ఒక సెక్యులర్ దేశం, అన్ని మతాలకు చెందిన పౌరులు సమానమే.. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని మతపరమైన నిర్మాణాలు చేస్తే.. వివక్ష చూపకుండా వాటిపై చర్యలు తీసుకునే హక్కు అధికారులకు ఉంది.

 

సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు బిఆర్ గవై, జస్టిస్ కెవి విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. కొన్ని రాష్ట్రాల్లో.. బుల్ డోజర్ న్యాయ్ పేరుతో నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారంటూ వారికి వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే పిటీషన్ల విచారణ సమయంలో అధికారులు తాము కేవలం అక్రమంగా నిర్మించిన కట్టడాలను మాత్రమే కూలుస్తున్నామని తమ వాదన వినిపించారు.

 

ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ ఆరోపణలు రావడంతో.. ఈ మూడు రాష్ట్రాల తరపున సొలిసిటర్ జెనరల్ తుషార్ మెహ్తా వాదించారు. పిటీషనర్లు తరపున న్యాయవాది సి యు సింగ్ మాట్లాడుతూ.. ”కేవలం ఒక మతానికి చెందిన కట్టడాలను మాత్రమే కూలుస్తున్నారని.. అది కూడా ఒక వ్యక్తి నేరస్తుడైతే.. అతని ఇల్లు, లేదా ఇతర ఆస్తిని అధికారులు ధ్వంసం చేస్తున్నారని.. ఇలా చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా?.. పైగా కేవలం ఒక రోజు ముందు మాత్రమే నోటీసులు ఇచ్చి కల్చేయడం న్యాయమేనా?” అని ప్రశ్నించారు.

 

దానికి సుప్రీం కోర్టు ధర్మాసనం.. ”నేరస్తుడి ఇల్లు కూల్చే హక్కు ఎవరికీ లేదు. అతను టెర్రరిస్టు అయినా, రేపిస్టు అయినా అతని ఆస్తి కూల్చే హక్కు లేదు. అధికారులు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఇవ్వాలి?.. పైగా ఆ ఆస్తి వివరాలు మునిసిపల్ కార్పొరేషన్ లేదా పంచాయత్ కు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ పోర్టల్ లో వెరిఫై చేసుకోవాలి” అని చెప్పింది.

 

అయితే సొలిసిటర్ జెనరల్ తుషార్ మెహ్తా స్పందిస్తూ.. ఒక మతానికి చెందిన కట్టడాలు కూల్చేసిన ఘటనల్లో అవన్నీ అక్రమ కట్టడాలని కోర్టు అది గమనించాలని అన్నారు.

 

సుప్రీం కోర్టు ధర్మాసనం దీనిపై తన అభిప్రాయం చెబుతూ.. ”ఏ మతానికి చెందిన అక్రమ నిర్మాణమైన దాన్ని తొలగించాల్సిందే.. రోడ్డుపైన, ఫుట్ పాత్ పైన , రైల్వే లైన్, నదిజలాల పరిసరాల్లో స్థలాలు ఆక్రమించుకొని నిర్మిస్తే.. వాటిని తొలగించాలి. ప్రజా భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి. నడిరోడ్డుపై.. ప్రజల రాకపోకల చేసే మార్గంలో అడ్డంగా గురుద్వార, దర్గా, దేవాలయం లాంటివి నిర్మించినా వాటని తొలగించాల్సిందే. అయితే అక్రమ నిర్మాణాలపై ఒకటే చట్టాన్ని పాటించాలి. అది మతం, లేదా ఇతర నమ్మకాలకు అతీతంగా ఉండాలి” అని వ్యాఖ్యానించింది.

 

అడ్వకేట్ సియు సింగ్ వాదిస్తూ.. అక్రమ నిర్మాణాలు కాకపోయినా కేవలం ఒక నేరస్తుడి ఇల్లు అని అధికారులు కూల్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిపై సమాధానం అధికారులు చెప్పాలి అని వాదించారు. ప్రతి వాదనగా తుపార్ మెహ్తా.. ”కేవలం అలాంటివి కొన్ని ఘటనలే ఉన్నాయి.. అవి కూడా అక్రమ కట్టడాలని తెలియజేశాము” అని చెప్పారు.

 

అయితే సుప్రీం కోర్టు దీనిపై సీరియస్ అయింది. ”కొన్ని ఘటనలు కాదు.. ఏకంగా 4.45 లక్షల ఇళ్లు, ఆస్తులు కూల్చేశారు. చాలా స్పష్టంగా చెబుతున్నాం.. నేరస్తుడైనంత మాత్రాన అతని ఇల్లు, ఆస్తులు.. కూల్చే హక్తు ఎవరికీ లేదు. ఇది పౌరల హక్కులు హరించడమే అవుతుంది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు పౌరుల ఇళ్లు, ఆస్తులు, కూల్చడానికి వీల్లేదు.” అని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు కోర్టు ఆంక్షలు విధించింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |