UPDATES  

NEWS

 జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త మూవీ షూటింగ్ మొదలు..!

ప్రముఖ యంగ్ హీరో శ్రీ విష్ణు (Sri Vishnu) మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ మొదలుపెట్టి, చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తో హీరోగా మారి కెరీర్లో బెస్ట్ ఫామ్ ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న శ్రీ విష్ణు అందులో భాగంగానే ఈసారి సరికొత్తగా ట్రై చేశాడని చెప్పాలి. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా నాలుగు క్యారెక్టర్లలో నటిస్తూ.. టైం ట్రావెల్ మూవీ స్వాగ్ అనే చిత్రంతో అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 

స్వాగ్ తో ముందుకొస్తున్న శ్రీ విష్ణు..

 

ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కాస్త కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టలేదు చిత్ర బృందం.దీంతో ఈ సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

నిర్మాతగా మారనున్న డైరెక్టర్ బాబీ..

 

ఇదిలా ఉండగా శ్రీ విష్ణు తన 19వ చిత్రానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రముఖ డైరెక్టర్ బాబి భార్య ఈయన చిత్రానికి నిర్మాతగా మారబోతోంది. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి నిర్మాతగా ఈ చిత్రంతో మారనున్నారు. విజిల్ వర్తీ ఫిలిం అనే బ్యానర్ స్థాపించి, తన సమర్పణలో తన భార్యను నిర్మాతగా పరిచయం చేస్తున్నారు బాబి. అంతేకాదు పవర్ సినిమా నుంచి తన దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన జానకి రాముడిని దర్శకుడుగా ఇంట్రడ్యూస్ కి పరిచయం చేస్తున్నారు. ప్రముఖ రచయిత కోనా వెంకట్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటూ ఉండటం గమనార్హం. శ్రీ విష్ణు 19వ సినిమా పలువురు ప్రముఖులతో చాలా ఘనంగా ప్రారంభమైంది.

 

లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తి..

 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా , డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షార్ట్ కి సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకులు కిషోర్ తిరుమల , నందిని రెడ్డి మేకర్స్ కి స్క్రిప్టును అందజేశారు. అంతేకాదు ఈ పూజా కార్యక్రమానికి మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార ఎంటర్టైన్మెంట్స్ మేకర్స్ నాగ వంశీ , బివిఎస్ రవి, షైన్ స్క్రీన్ ప్రొడ్యూసర్ సాహు గరికపాటి తదితరులు హాజరై పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేశారు

 

వచ్చే ఉగాది నుంచి షూటింగ్ ప్రారంభం..

 

ఇకపోతే ఈ కొత్త సినిమా కొత్త తెలుగు సంవత్సరం సందర్భంగా.. వచ్చే ఏడాది ఉగాది నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |