UPDATES  

NEWS

 తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం..

తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం చెలరేగింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు ఆవిష్కరించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదం కాస్తా పతాక స్థాయికి చేరింది.

సచివాలయం వద్ద నిర్మించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహం అక్కడ నెలకొల్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం ఏమిటంటూ భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు

తెలంగాణ తల్లిని అవమానిస్తారా?, తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా?, తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా?, తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా?, తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు

ఈ విషయాన్ని మరోసారి లేవనెత్తారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణ సమాజాన్ని అవమానిస్తూ రేవంత్ రెడ్డి చేసిన తప్పును తాము సరిదిద్దుతామని కేటీఆర్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం- అమరజ్యోతి నడుమ తెలంగాణ తల్లి కొలువుదీరాల్సిన చోట పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తేల్చి చెప్పారు.

తెలంగాణ భవిష్యత్ తరాలకు, ఇక్కడి సమాజానికి మార్గదర్శిగా ఉండాల్సిన ఆ స్థలంలో రాజీవ్ గాందీ విగ్రహాన్ని నెలకొల్పడం ఏ మాత్రం సరికాదని అన్నారు. భవిష్యత్ పాలకులకు స్ఫూర్తిని నింపేలా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. సకల మర్యాదలతో దాన్ని గాంధీభవన్‌కు పంపిస్తామని చెప్పారు. ఆ విగ్రహం మీద అంత ప్రేమే ఉంటే జూబ్లీహిల్స్‌లో గల ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు తాను ఈ మాట చెబుతున్నానని గుర్తు చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |