UPDATES  

NEWS

 కేబినెట్ భేటీ – వాలంటీర్లు, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..!

ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఏపీలో వరదల కారణంగా జరిగిన నష్టం..ప్రభుత్వ సాయం పైన చర్చించనున్నారు. అదే విధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నూతన మద్యం, పాలసీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. మైనింగ్ పాలసీపైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

 

బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు

ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల అంశానికి ఆమెద ముద్ర వేయనుంది. ఈ మేరకు నేడు కేబినెట్ లో చర్చించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు. 2014-19 మద్య కాలంలో అమలైన ఎన్టీఆర్ విదేశీ విద్య, విద్యోన్నతి పథకాలను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఈ నెల 20తో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కానుండడంతో క్యాబినెట్‌లో ప్రస్తావనకు రానుంది. శాఖల వారీగా మంత్రుల ప్రోగ్రస్ కార్డులను చంద్రబాబు సంబంధిత మంత్రులకు అందించనున్నారు.

కొత్త మద్యం పాలసీ

కూటమి ప్రభుత్వం ఇప్పటికే కొత్త మద్యం పాలసీ సిద్దం చేసింది. ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో ఈ పాలసీ పైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల ను చర్చించి తుది నిర్ణయం తీసుకోన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ప్రయివేటు వ్యక్తులకే మద్యం దుకాణాల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ నెలాఖరులోగా టెండర్లను ఫైనల్ చేయటంతో పాటుగా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెస్తూనే తక్కువ ధరలకు విక్రయించేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నూతన మైనింగ్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.

 

వాలంటీర్లను ఏం చేద్దాం

వరద సహాయక చర్యలలో ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేసిన తీరును క్యాబినెట్ అభినందించనుంది. ఇక, వాలంటీర్ల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు నెలలుగా వాలంటీర్ల సేవలకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. వాలంటీర్లను స్కిల్ శిక్షణ ఇచ్చి..పరిమిత సంఖ్యలో వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ రోజు మంత్రివర్గంలో ఈ మేరకు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక..వీటితో పాటుగా పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వివాదం.. రాజకీయ అంశాల పైన మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |