UPDATES  

NEWS

 పుష్ప2 కు పోటీగా చావా..!

నేషనల్ క్రష్‌ అందాల భామ రష్మిక గురించి మనందరికి తెలిసిందేగా. యానిమల్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తూ బిజీ బిజీ అవుతోంది. ఇక వీటితో పాటుగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఒకేరోజు రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కావడమే ఇందుకు మెయిన్ రీజన్.

 

రష్మిక హీరోయిన్‌గా నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడంతో తనకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మిగతా వారికి ఇది చిన్న ప్రాభ్లమ్ అయి ఉండొచ్చు. కానీ తనకి మాత్రం పెద్ద సమస్య అనే చెప్పాలి. ఈ రెండు మూవీస్‌కి సంబంధించిన ప్రమోషన్స్ ఒకేసారి జరగనున్నాయి. అంతేకాదు రెండు ఈవెంట్లకు అటెండ్ అవడం తనకు కష్టతరంగా మారనుంది. అందుకే రష్మిక ఆ రెండింటిని ఎలా అడ్జెస్‌మెంట్ చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ పక్క బజ్ ఉన్న మూవీ పుష్ప 2.

 

ఈ మూవీకి పోటీగా దిగేందుకు చావా దర్శకులు ఫిక్స్ అయ్యారు. బహుశా పుష్ప 2 మూవీ వాయిదా పడనుందనే హోప్స్‌తో థియేటర్‌లోకి రానున్నారా లేక తాము క్రియేట్ చేసుకున్న కంటెంట్ మీద దర్శకుల ధైర్యమా.. అసలు అందులో ఏం ఉన్నదనే ధైర్యం ఈ మూవీ టీమ్‌ ఏం చేయనుందనేది సస్పెన్స్‌గా మారింది. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్‌ టాఫిక్‌గా మారింది.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |