పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల దగ్ధం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ధవళేశ్వరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పరిపాలనా భవనం వద్ద కొన్ని ఫైళ్లు తగలబడిన స్థితిలో కనిపించాయి. ప్రభుత్వం దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించింది.
కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న కారం బేబీ, కె.నూకరాజు, స్పెషల్ ఆర్ఐ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్ లను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు కుమారి, సత్యదేవిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Post Views: 18