దేశంలో పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ..మెరుగైన రవాణా వ్యవస్థ దిశగా కేంద్రం అడుగులు వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎనిమిది హై స్పీడ్ రోడ్డు కారిడార్ ప్రాజెక్టులకు అనుమతినిస్తూ కేంద్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్ల పొడవున యాభై వేల ఆరువందల అరవై ఐదు కోట్ల రూపాయల ఫండ్స్ తో హైస్పీడ్ రో్డు కారిడార్ ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. దేశంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ఆరు, నాలుగు రోడ్ల రింగు రోడ్డు పనులు చేపట్టనున్నారు.
ఆర్థిక పురోగతి
మెరుగైన రవాణా వ్యవస్థ ద్వారా దేశ ఆర్థిక ప్రగతి పురోగతిలో పయనిస్తుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. దీని ద్వారా దేశ ఆర్థిక రూపురేఖలు మారిపోతాయని మోదీ అన్నారు.
ఎనిమిది నేషనల్ హైస్పీడ్ రోడ్డు కారిడార్ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. ఎందుకంటే నాలుగున్నర కోట్ల పనిదినాలు అందుబాటులోకి వస్తాయి. దాదాపు 40 సంవత్సరాల పాటు నిరంతరం ఉపాధి పనుల కల్పనతో సామాన్యుల ఆర్థిక అవసరాలు కూడా మెరుగవుతాయి. నిరుద్యోగిత శాతం కూడా గణనీయంగా తగ్గుతుంది. ముందుగా నాసిక్ ఫాటా ఖేడ్ కు సంబంధించి 8 లైన్లు గా విస్తరణ ఉండబోతోంది. అలాగే ఆగ్రా..గ్వాలియర్ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించనున్నారు. అహ్మదాబాద్ హైవేను 6 లైన్లుగా. రాయ్ పూర్ రాంచీ మార్గంలో నాలుగు దారుల జాతీయ రహదారిగా, కాన్పూర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారిని ఆరు వరుసలుగా ,ఆగ్రా..గ్వాలియర్ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు.
ఆదాయం, సమయం
దేశంలో వివిధ ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా ఆయా ప్రాంతాలకు సంబంధించిన వస్తువులు, నిత్యావసరాలు అతి తక్కువ ఖర్చుతో ఇతర ప్రాంతాలకు సరఫరా చేయవచ్చు. తద్వారా ఆదాయం, సమయం రెండూ కలిసి వస్తాయి. మధ్యలో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకుని గోడౌన్ల మాదిరిగా సరుకును భద్రపరుచుకోవచ్చు.