పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లలో తన సత్తా చాటుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్టర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ స్థాయిలో నిర్మించాడు.
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ కొత్త ప్రంపంచం యావత్ ప్రపంచ సినీ ప్రియుల్ని ఫిదా చేసింది. కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్, క్యారెక్టర్స్ ఇలా ప్రతి విషయంలోనూ డైరెక్షన్‌లో కుమ్మేశాడు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ల మధ్యన వచ్చే యాక్షన్ సన్నివేశాలకు థియేట్లలో గూస్‌బంప్స్ వచ్చాయి. అలాగే కమల్ హాసన్ విలన్ రోల్, దీపికా పదుకొనే, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటీ నటులు తమ నటనతో దుమ్ము దులిపేశారు. ఓవరాల్‌గా భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది.
ఇక ఈ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమాలపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా క్లాసిక్ లుక్‌లో లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకు ప్రభాస్‌ను మాస్ యాక్షన్ లుక్‌లో చూసిన అభిమానులు ఈ సినిమాలో చాలా స్టైలిష్ లుక్‌లో చూడబోతున్నారు.
ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ ఓ రేంజ్‌లో వచ్చింది. అందులో ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉండటమే కాకుండా స్వాగ్, ఎంట్రీ స్టైల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. దీంతో ఈ మూవీ కూడా మంచి హిట్ కొడుతుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ తర్వాత అతడి లైనప్‌లో ఉన్న మరో సినిమా ‘ఫౌజీ’. ‘సీతారామం’ ఫేం హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ చాలా డిఫరెంట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించబోతున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగిన యుద్ధ కథను దర్శకుడు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దానికి కాస్త ప్రేమ కథ జోడించి గుండెల్ని హత్తుకునేలా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇందులో ఎంతమేర నిజం ఉందో తెలియాల్సి ఉంది.