UPDATES  

NEWS

 ఏపీలో నూతన మద్యం విధానం.. ఎప్పట్నుంచంటే..?

నూతన మద్యం విధానాన్ని రూపొందించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. మొత్తం 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులతో కూడిన మొత్తం 4 బృందాలను ఏర్పాటు చేసింది.

 

రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఈ నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ విధానం, మద్యం షాపులు, బార్లు, మద్యం కొనుగోళ్లు, ధరలు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. అదేవిధంగా ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ బృందాలు దృష్టిసారిస్తాయి.

 

ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి ఈ బృందాలు ఓ నివేదికను అందజేస్తాయి. ఈ నెల 12 లోగా నివేదకలు సమర్పించాలని ఈ నాలుగు అధ్యయన బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 అనగా అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |