UPDATES  

NEWS

 ఏపీలో నిరుద్యోగులకు కొత్త పథకం..!

నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువ నేస్తం పథకాన్ని అందించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారని, దీని ప్రకారం ప్రతీ నిరుద్యోగికి 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

 

ఏపీలో నిరుద్యోగ భృతి… అభ్యర్థుల అర్హతలు అయితే ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువనేస్తం పథకంలో నిరుద్యోగ భృతి పొందాలంటే వయస్సు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం ఇంటర్ మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హతగా ఉండాలి. ఏపీ పౌరుడై ఉండాలి.

అలా అయితే నిరుద్యోగ భృతి రాదు నిరుద్యోగ భృతి కావాలనుకునే అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు రూ. 10,000కన్నా తక్కువ ఆదాయం ఉండాలి. అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో 1500చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో 5ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.అంతేకాదు అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారై ఉండరాదు. అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం నుండి లబ్ధి పొందకుండా ఉండాలి.

 

అర్హులు వీరే ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు ఖాతా వివరాలు, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నామని తెలియజేసే కుటుంబ ఆదాయం సమాచారం, రేషన్ కార్డుతదితర పత్రాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో అప్లై చెయ్యాలి. [AP Yuva Nestham] (https://yuvanestham.ap.gov.in/) వెబ్‌సైట్ లోకి వెళ్లి అందులో ఉండే నమోదు ఫారం భర్తీ చెయ్యాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చెయ్యాలి.

 

ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తు అప్లై చేసుకున్న తర్వాత రిప్లైగా వచ్చిన రిసిప్ట్, అప్లికేషన్ ఐడీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాలలో ఆఫ్ లైన్ ప్రాసెస్ కూడా అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం. ఆన్ లైన్, ఆఫ్ లైన్ డాక్యుమెంట్స్ ను అధికారులు వెరిఫై చేసి, వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత, ప్రతీ నెల మీ బ్యాంక్ ఖాతాలో భృతి జమ చేస్తారు.

 

సోషల్ మీడియా ప్రచారం.. ప్రకటన చెయ్యని టీడీపీ కూటమి సర్కార్ ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా, ప్రభుత్వం అందించిన హెల్ప్‌లైన్ నంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే, అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పథకం వివరాలు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రకటన చెయ్యలేదు. యువనేస్తం వెబ్ సైట్ కూడా ప్రారంభించలేదు. అయితే ఇది నిజమైతే బాగుండు అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |