UPDATES  

NEWS

 నిరుద్యోగ సమస్యలపై హరీష్ లేఖాస్త్రం..!

గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు శనివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా, గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులకు నియామక ఉత్తర్వులు అందించడం తప్ప, ఇప్పటివరకు కొత్త పోస్టులను భర్తీ చేయలేదన్నారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారంటూ హరీశ్‌రావు నిలదీశారు.

 

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మరిచారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్ష అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారని, అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటిందని అయిన ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

 

మీరు అధికారం లోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని మీ మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించారు. 25 వేల టీచర్ పోస్టులలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

అదే విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకున్న బకాయీ మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని కోరుతున్నాను.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినంక వారిని నట్టేటముంచి జి.వో 46ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తిచేశారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన వాగ్దానాలను గుర్తుచేసేందుకు, తద్వారా వారి ప్రయోజనాలను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |