UPDATES  

NEWS

 రైతు రుణ మాఫీపై కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీ చేయడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15 లోపు రైతు రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేయడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీ ఇప్పటికే పలుమార్లు మంత్రులు, అధికారులతో చర్చించారు. నిధుల సమీకరణ, మార్గదర్శకాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

పీఎం కిసాన్ లబ్ధిదారులకే రుణ మాఫీ చేసే అవకాశం ఉంది. సంస్థలకు ఉన్న భూములకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్లు, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లకు పీఎం కిసాన్ రాదు. ఇలానే రుణ మాఫీ కూడా వీరికి అమలు చెయ్యొద్దని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 21 జరిగే మంత్రివర్గ సమావేశంలో రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది.

 

అయితే రుణ మాఫీని దశలవారీగా అమలు చేసేందేకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు దశల్లో రుణ మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులైలో మొదలు పెట్టి ఆగస్ట్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన ఇచ్చే వారికి రుణ మాఫీ చేయాలంటే 26 లక్షల రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇందుకు కోసం రూ.6 కోట్లు కావాలి.

 

రెండో దలో రూ.లక్షన్నర వరకు రుణాన్ని మాఫీ చేసే అవకాశం ఉంది. ఇందుకు రూ.6,500 కోట్లు అవసరం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రెండు దశల్లో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేయనున్నారు. గత ప్రభుత్వం కూడా ఇలా దశలవారీగా రుణ మాఫీ అని కొందరికి రుణ మాఫీ చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్ట పరిహారం విడుదల చేసిందని ప్రకటించినా ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీంతో దశలవారీ రుణ మాఫీ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |