ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికలముందు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా మెగా డీఎస్సీ ఫైల్ పైన మొదటిసంతకం చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, మూడవ సంతకం సామాజిక పింఛన్ల పెంపు నాలుగు వేలకు చేస్తూ చేశారు . అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపైన నాలుగో సంతకాన్ని, నైపుణ్య గణనపైన ఐదవ సంతకాన్ని చేశారు.
పవన్ కళ్యాణ్ ఆలోచన అమలు దిశలో చంద్రబాబు అయితే నైపుణ్య గణనపైనే చంద్రబాబు చేసిన సంతకం వెనుక అద్భుతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ దేనని అంటున్నారు జనసైనికులు. అయితే దేశంలోనే తొలిసారి ఏపీలో అమలు చేయాలని భావించిన స్కిల్ సెన్సెస్ పవన్ కళ్యాణ్ ఆలోచనలో నుంచే వచ్చిందని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పవన్ ఆలోచనను చెప్పిన చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలి నాడే చంద్రబాబు, పవన్ ఆలోచనకు ప్రాధాన్యత నిచ్చి సంతకం చేసిన ఫైల్స్ లో స్కిల్ సెన్సస్ కూడా ఉండడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నైపుణ్య గణన ఆలోచన పవన్ కళ్యాణ్ ది అని, తప్పకుండా అది చేసి తీరుతామని చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
దేశంలోనే తొలిగా ఏపీలో స్కిల్ సెన్సెస్ దీంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే చంద్రబాబు చేసిన తొలి అయిదు సంతకాలలో ఒక సంతకం నైపుణ్య గణన ఫైలు పైన ఉండడం జనసైనికులకు సంతోషాన్ని కలిగిస్తుంది. దేశంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే స్కిల్ సెన్సెస్ లెక్కలు తీయనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆలోచన అమల్లోకి వస్తుందని, ఇది యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉంటుందని జనసైనికులు సంతోషంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ చేస్తున్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించి ఫైల్స్ పైన సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు కొద్దిసేపు అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. వారంతా భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై చంద్రబాబుకు అనేక కీలక సూచనలను చేశారు. తమ ఆలోచనలను చంద్రబాబుతో పంచుకున్నారు.
పవన్ కు తనకు మధ్య జరిగిన సంభాషణ చెప్పిన చంద్రబాబు అప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు తనకు జరిగిన సంభాషణలను గుర్తు చేసి అనేక విషయాలను చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు కొద్దిగా నటన నేర్పిస్తే, దానిని అందిపుచ్చుకుని స్వయంకృషితో తను పైకి ఎదిగానని తనతో చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు.