UPDATES  

NEWS

 2027లోనే జమిలీ ఎన్నికలు..కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.కమిటీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్(ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చేయాలని సూచించింది.

 

ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్ సభ,రాజ్య సభ లో 67% మంది సపోర్ట్ చెయ్యాలి ,14 రాష్ట్ర అసెంబ్లీలు మద్దతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా మద్దతు ఇస్తే బిల్లు ఆమోదం పొంది జమిలి ఎన్నికలు సాధ్యం అవుతాయి. ఈ బిల్లు 2024 ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.ఈ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు లభిస్తే 2027 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది.ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్,గ్రామ పంచాయితి ఎన్నికలు నిర్వహిస్తుంది.

 

దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలి ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద ఘోషి తెలిపారు. అయితే ఏపీ, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు 2029 వరకు పాలించే హక్కు ఉంది. రెండేళ్ల పరిపాలనను రద్దు చేసుకుని ఎన్నికలు వెళ్తాయా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండటం, అటు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ సైతం జమిలి ఎన్నికలకు సై అనడంతో , దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు సాధ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2027లోనే జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |