UPDATES  

NEWS

 హైదరాబాద్ లో ఉద్రిక్తత..! హోంమంత్రి బండి సంజయ్ అరెస్ట్..!

తెలంగాణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన గ్రూప్ 1 అభ్యర్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు.

 

నిరసన నీడలో అశోక్‌నగర్‌…

 

ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభ్యర్థుల నిరసనకు మద్దతు ఇచ్చారు. అనంతరం అశోక్‌నగర్ నుంచి ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునివ్వడంతో ముట్టడికి వందలాది మంది బయల్దేరారు. అడ్డుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సచివాలయాన్ని ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

 

జీఓ 29ను ఎత్తేయాలి…

 

జీఓ నెం 29పై సర్కారు దిగిరావాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అభ్యర్థులు తెల్చి చెప్పారు. గ్రూప్ వన్ అభ్యర్థులు, కషాయ దళాల ఆందోళనతో ఉద్రిక్తత పెరిగింది. ఒకదశలో సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్‌కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ సచివాలయాన్ని ముట్టడి చేసే వరకు వెనక్కి తగ్గేదిలేదన్నారు.

 

బండి అరెస్ట్…

 

ఇక అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద కొంతమంది అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు, మరోసారి ఆలోచించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ఎలా రాస్తారని నిలదీశారు. జీఓ 29పై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

 

వందలాది మంది అరెస్ట్…

 

వందలాది మంది గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, స్థానిక పీఎస్ కి తరలించారు. మరోవైపు అశోక్ నగర్ నుంచి సచివాలయం పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల పహారాలోనే కొనసాగుతుంటం గమనార్హం.

 

ఇదే బాటలో బీఆర్‌ఎస్…

 

గ్రూప్ 1 అభ్యర్థులకు బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లు మద్దతిచ్చారు. దీంతో అశోక్‌నగర్‌ చేరుకుని అభ్యర్థులకు పక్షాన నిరసన చేపట్టారు. అనంతరం నిరుద్యోగులతో కలిసి సెక్రెటేరియట్ వైపు వెళ్తుండగా ఆయా నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.

 

వాళ్లది న్యాయమైన డిమాండే…

 

సాయంత్రం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు జీవో 29ను తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర దాగి ఉందన్న అనుమానం అభ్యర్థుల్లో ఉందని బండి సంజయ్‌ చెప్పారు.

 

జీఓ 29 వల్ల అన్యాయమే…

 

అన్ని వర్గాలకు న్యాయం చేయడానికే మోదీ సర్కార్ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. జీఓ 29 వల్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అయితే గ్రూప్‌-1 రద్దు చేయాలని అడగట్లేదని, కేవలం వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లది ప్రజా ప్రభుత్వం అంటూ భారాస సర్కార్ మాదిరే నడుచుకుంటోందని ఎద్దేవా చేశారు. పరీక్ష పూర్తైన తర్వాత కోర్టు రద్దు చేస్తుందన్న భయం అభ్యర్థుల్లో ఉందన్నారు.

 

తక్షణమే సీఎం స్పందించాలి…

 

సోనియాగాంధీ జన్మదినం రోజున ఎంతమందిని బలి తీసుకుంటారో తెలియదన్నారు. గ్రూప్‌-1 అభ్యర్థులపై రోజూ లాఠీఛార్జి జరుగుతోందని, వాళ్లది న్యాయమైన డిమాండ్‌ అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలన్నారు. ప్రభుత్వం అంటే మొండిపట్టుతో ఉండకూడదని, సమస్యను పరిష్కరించేందుకు ఆలోచించాలన్నారు.

 

బీఆర్ఎస్ చొరబడింది…

 

తమ ర్యాలీలోకి చొరబడి విధ్వంసాలకు పాల్పడాలని బీఆర్ఎస్ కుట్రలు చేసిందని బండి సంచలన ఆరోపణలు చేశారు. కానీ దీన్ని నిరుద్యోగ యువతే అడ్డుకోగా, తమ కార్యకర్తలతో ఘర్షణకు దిగారన్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |