పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన వరుసగా ఐదు సినిమాలు లైన్లో పెట్టారు. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘హనుమాన్’ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన కథని కూడా ప్రభాస్ ఓకే చేశారట.
ప్రస్తుతం ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి తోడు శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ ఇమోజీ (Emoji)తో పోస్ట్ షేర్ చేశారు. దీంతో ఈ ప్రచారనికి మరింత బలం చేకూరింది. ఇక ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్ అయ్యింది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ఇద్దరి కాంబోలో మూవీ ఎప్పుడు మొదలవుతుందా? ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ- ప్రభాస్ సినిమా గురించి వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అప్పుడే ప్రకటన
అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని టాక్ వినిపిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోందని సమాచారం. ఈ కాంబినేషన్లో మూవీ వస్తే అది సోషియో ఫాంటసీనా లేక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనరా? అని అప్పుడే ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలు పెట్టారు.
కాగా, ప్రభాస్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ కల్కి ‘AD 2898’లో కూడా పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నుంచి బిగ్‌బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కోలీవుడ స్టార్ కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. దీంతో స్పిరిట్‌లో కూడా ప్రముఖులు నటించే ఆవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న రిలీజైంది. లాంగ్ రన్లో వరల్డ్ వైడ్‌గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.