UPDATES  

NEWS

 ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్..

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు తాజా హత్యా బెదిరింపు వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో నటుడు సల్మాన్ ఖాన్ రూ.5 కోట్లు ఇచ్చి లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ లో సంధి చేసుకోవాలని.. అంతటితో శత్రుత్వం ముగించాలని ఉంది. ఒకవేళ చెప్పినట్లు డబ్బులు ఇవ్వపోతే ఇటీవల చనిపోయిన మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖ్ కు పట్టిన గతే పడుతుందని.. అతని చావుకంటే సల్మాన్ ఖాన్ చావు దారుణంగా ఉంటుందని బెదిరింపులు కూడా ఈ మెసేజ్ లో ఉన్నాయి. ఈ మెసేజ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు పంపించారనే అనుమానాలున్నాయి.

 

“ఈ మెసేజ్‌ని తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ తన ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే.. లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వం ముగించాలనుకుంటే, అతను ₹ 5 కోట్లు చెల్లించాలి, డబ్బు ఇవ్వకపోతే, అతని పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా ఉంటుంది” అని ఆ వాట్సాప్ బెదిరింపు మెసేజ్ లో ఉంది.

 

వారం రోజుల క్రితం మహారాష్ట్ర అధికార కూటమి పార్టీ ఎన్‌సీపీకి చెందిన బాబా సిద్దిఖ్ ని కొందరు దుండగులు కాల్చి చంపారు. సల్మాన్ ఖాన్ తో స్నేహం వల్లే బాబా సిద్దిఖ్ హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా ముంబై పోలీసులకే బెదిరింపు మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మెసేజ్ ఎవరు పంపించారనే కోణంలో విచారణ ప్రారంభించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ సిబ్బందిని పెంచారు.

 

మరోవైపు బాబా సిద్దిఖ్ హత్య కేసులో నవీ ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ లో కీలక సభ్యుడైన సుఖ్ బీర్ బల్బీర్ సింగ్ అలియాస్ సుఖాని హర్యాణాలోని పానీపత్ నుంచి అరెస్ట్ చేశారు. సుఖా ఇంతకుముందు సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు. ఇతను సల్మాన్ ఖాన్ ని హత్య చేసేందుకు పాకిస్తాన్ కు చెందిన షూటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. కాంట్రాక్ట్ తో పాటు షూటర్లకు AK-47, M16 రైఫిల్ తుపాకులు కూడా సరఫరా చేశాడని పోలీసులు తెలిపారు.

 

కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో పోలీసులు ఇప్పటిరకు 18 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరికి 60 నుంచి 70 ఇన్‌ఫార్మర్లు ఉన్నారని.. వారంతా సల్మాన్ ఖాన్ ఇల్లు, సినిమా షూటింగ్ లొకేషన్స్ తో చాలా కాలంగా రెక్కీ చేశారని విచారణలో తేలింది. సల్మాన్ ఖాన్ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గ్యాంగ్ లో మైనర్లతో సహా 700 మంది షార్ప్ షూటర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

1998లో ఒక సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుండగా నటుడు సల్మాన్ ఖాన్ ఆ ప్రాంతంలో సంచరించే బ్లాక్ బక్ జింకలను వేటాడాడు. ఆ జింకలను బిష్ణోయి సమాజాకి వర్గం కులదైవంగా ఆరాధిస్తారు. దీంతో సల్మాన్ ఖాన్ పై ఆ వర్గానికి చెందిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి పగబట్టాడు. సల్మాన్ ఖాన్ ని చంపుతానని 2018లో బహిరంగంగా బెదిరింపులు చేశాడు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |