UPDATES  

NEWS

 కొత్త ఎస్పీల నియామకంపై ఈసీ కీలక నిర్ణయం..!

ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం వీరి నియామకం పైన ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకుపోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది. దీంతో ఈ పోస్ట్‌లు ఖాళీ అయ్యాయి. ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరని.. మూడు పోస్టులకు ఏపీ ప్రభుత్వం ఐదుగురు పేర్లతో కూడిన ప్యానల్‌ను పంపించింది.

 

ఈ జాబితాలో ఎన్నికల సంఘం ఖరారు చేసిన పేర్లతో మూడు జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీ శాలి , తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌, పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్‌ను నియమించారు. అదే విధంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌ గా శ్రీకేష్‌ బాలాజీ ని నియమించారు. ఈనెల 13న జరిగిన పోలింగ్ రోజు, తరువాత జరిగిన మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, డీజీపీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఘటనలపై వెంటనే స్వయంగా వచ్చి నివేదికలను అందజేయాలని ఆదేశించిన మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ ఢిల్లీకి వెళ్లి నివేదికను అందజేశారు. సీఈసీ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్‌ను, మూడు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయడంతో ఖాళీ అయిన పోస్టులలో కొత్తవారిని నియమించింది. మూడు జిల్లాలకు నియమించాల్సిన అధికారుల విషయంలో ఈసీ సూచనల మేరకు మూడు పోస్టులకు ఏపీ ప్రభుత్వం ఐదుగురు పేర్లతో కూడిన ప్యానల్‌ను పంపించింది. ఎన్నికల పరిశీలకుడి పైన వైసీపీ ఫిర్యాదు పై విచారణ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |