ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అన్ని పార్టీల ఫోకస్ ఒకేఒక్క అంశంపై ఉన్నట్టు ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయిన రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నప్పటికీ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కామన్ గా ఒకే అస్త్రంపైన ఆధారపడ్డాయి అంటే అతిశయోక్తి కాదు.
ఏపీలో గెలుపు కోసం అన్ని పార్టీల అస్త్రం తాజాగా ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల వార్ లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన, కాంగ్రెస్ లు ఏం చేస్తున్నాయి? అన్ని పార్టీలు నమ్ముకున్న అత్యంత కీలకమైన అంశం ఏమిటి అంటే.. ఏపీలో అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రజలమద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాదు ప్రతిపక్షపార్టీలు ఏం చేస్తున్నాయి? ప్రత్యర్థి పార్టీల నాయకులు చేస్తున్న తప్పులేమిటి? అన్న అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి.
రంగంలో సోషల్ మీడియా సైన్యం అందులో భాగంగా సోషల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దించి ఇబ్బడి ముబ్బడిగా వీడియోలు, ఆడియోలు వైరల్ చేస్తున్నాయి. అంతేకాదు తమ పార్టీకి ప్రజల నుంచి అనుకూలమైన వేవ్ ఉందని తెలియ చెప్పడం కోసం జనాల నుంచి పాజిటివ్ బైట్స్ ను కూడా సేకరించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా అస్త్రాన్ని అన్ని పార్టీలు ప్రయోగిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నదిదే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని పార్టీలు చేస్తున్నది ఇదే తంతు. వైసిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూటమి తరపున పనిచేస్తున్న సోషల్ మీడియా సైన్యం ప్రయత్నం చేస్తుంటే, కూటమి పార్టీల పొత్తులను ఎండగడుతూ, వైసిపి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి పెద్ద ఎత్తున తీసుకువెళుతూ, అభ్యర్థుల ప్రచారాలలో మైనస్ అయ్యే అంశాలను ప్రధానంగా తీసుకొని వైసిపి సోషల్ మీడియా పెద్ద ఎత్తున వీడియోలను, ఆడియోలను వైరల్ చేస్తుంది.
అన్ని పార్టీలకు ఇబ్బందికరంగా సోషల్ మీడియా వార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలైన వార్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలే కాదు, తిట్లు, బూతులు, ఫేక్ వీడియోలతో రెచ్చిపోతూ సాగుతున్న ఈ పంధా అన్ని పార్టీలకు ఇబ్బందికరంగానే మారింది.
సోషల్ మీడియాతోనే లక్ష్యం రీచ్ అవుతారా? అయినప్పటికీ ఒకరిని చూసి ఒకరు సోషల్ మీడియా ద్వారా వచ్చే రీచ్, మరి దేని ద్వారాను రాదని భావించి సోషల్ మీడియా సైన్యం పైన మెయిన్ గా ఫోకస్ పెట్టారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏపీ రాజకీయాలను సోషల్ మీడియానే శాసిస్తున్న పరిస్థితి, సోషల్ మీడియా వేదికగా అనేక ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాతోనే లక్ష్యం రీచ్ అవుతామన్న భావనే అందరిలో దీనిపై ఎక్కువ ఫోకస్ చెయ్యటానికి కారణమైంది.









