UPDATES  

NEWS

 ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు భారీ షాక్..!

మరో 14 రోజుల్లో ఎన్నికలకు సిద్దమవుతున్న ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై పలు వివాదాలు, విమర్శల పర్వ నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలోఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ లో కేసు దాఖలు కావడంతో స్పందించి ఆదేశాలు చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది.

 

రాష్ట్రంలో అనుమతుల్లేకుండా భారీగా చేపడుతున్న ఇసుక తవ్వకాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతోందంటూ పలువురు గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ))ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ అలాంటి తవ్వకాలను వెంటనే నిలివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఎన్జీటీ ఆదేశాల తర్వాత కూడా తవ్వకాలు జరుగుతుండటంతో కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

 

 

ఈ క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలైన అక్రమ ఇసుక తవ్వకాల కేసుపై ఇవాళ విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు.. రాష్ఠ్రంలో అక్రమంగా సాగుతున్న అన్ని ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించింది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై నివేదికతో మే 9వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సూచించింది.

 

దీంతో పాటు ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీటిని కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. గతంలో ఎన్జీటీ ఆదేశాల తర్వాత అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ ఇవ్వాలని స్ధానిక కాంట్రాక్టర్ అయిన జేపీ వెంచర్స్‌కు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అనుమతులు ఉన్న చోట మ్యానువల్‌గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |