UPDATES  

NEWS

 పెన్షన్ల పంపిణీపై నిర్ణయం మార్పు..

ఏపీలో ఎన్నికల వేళ పెన్షన్ల వ్యవహారం కీలకంగా మారుతోంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల వివాదం రాజకీయంగా ఆరోపణలకు కారణమైంది. దీంతో మే 1న చెల్లించాల్సి పెన్షన్ల పైన ప్రతిపక్షాలు వరుసగా ఎన్నికల సంఘానికి లేఖలు రాసాయి. పెన్షనర్లకు ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది. తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

 

ప్రభుత్వం మార్గదర్శకాలు పెన్షన్ల పంపిణీ పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం సూచనల మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మే, జూన్‌ నెలలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పెన్షన్‌ పంపిణీకి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయం మేరకు బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి నగదు బదిలీ ద్వారా నేరుగా ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తారు. బ్యాంక్‌ అకౌంట్‌ ఆధార్‌తో మ్యాప్‌ అయిన లబ్ధిదారులందరికీ ఇది వర్తిస్తుంది.

 

వారికి మాత్రమే ఇంటికి బ్యాంకు ఖాతాలు లేని వారు, దివ్యాంగులు, వయోవృద్ధులు, నడవలేక వీల్‌చైర్లకు పరిమితమైన వారికి… సచివాలయ ఉద్యోగులు ఇంటికే వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేస్తారు. మే, జూన్‌ నెలల్లో పెన్షన్ల కోసం ఎవరూ సచివాలయాల వద్ద పడిగాపులు కాయకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని శశిభూషణ్‌ ఆదేశించారు. నగదు బదిలీ జరిగే లబ్ధిదారుల పేర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది మొబైల్‌ యాప్‌లలో కనిపించవన్నారు. నగదు బదిలీ ద్వారా పెన్షన్‌ పంపిణీ చేసే వారి వివరాలు గ్రామ, వార్డ్‌ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు మే 1 తేదీన పంపిణీ ప్రారంభించి 5వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

 

రెండు నెలలు ఇలాగే అయితే, బ్యాంకు ఖాతాల్లో జమ చేసినా..లబ్దిదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు వెళ్లి నగదు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది .దీని పైన కొందరు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ, ప్రభుత్వ సిబ్బందితో ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, సిబ్బంది సమస్యల..ఎన్నికల నిర్వహణ వేళ వారిని పెన్షన్ల పంపిణీకి కేటాయించటం పైన ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ లేఖ రాసింది. ఈసీ సూచనల మేరకే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. జూన 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ కోడ్ అమల్లో ఉండనుండటంతో మే, జూన్ పెన్షన్లు ఇదే తరహాలో అందించనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |