UPDATES  

NEWS

 రణబీర్, సాయి పల్లవి రామాయణం నుండి ఫోటోలు లీక్..

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. బాలీవుడ్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి.. రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

 

ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఆదిపురుష్ అంటూ ఒక రామాయణం తెరకెక్కింది. ఇది ఎన్నో విమర్శలను అందుకుంది. ఇప్పుడు ఈ రామాయణ.. ఆదిపురుష్ కు వచ్చిన విమర్శలను అన్ని చెరిపేయాలని బాలీవుడ్ అనుకుంటుంది. ఇక ఈ చిత్రం మొదలైనప్పటినుంచి లీకుల బారిన పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న రామాయణ సెట్స్ లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు సీతారాముల ఫోటోలు లీక్ అయ్యాయి. సెట్ లో సీతారాముల గెటప్స్ లో ఉన్న రణబీర్ కపూర్, సాయిపల్లవి లుక్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

 

నిజం చెప్పాలంటే.. సీతారాములుగా ఈ జంట ఎంతో అద్భుతంగా ఉన్నారు. పట్టు వస్త్రాల్లో రాముడుగా రణబీర్ ఎంతో హుందాగా కనిపించగా .. సాయిపల్లవి తనదైన అందంతో సీతగా ఒదిగిపోయి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇలా లీక్ లు వస్తే సినిమాపై అంచనాలు తగ్గిపోతాయని షూటింగ్ అయ్యేవరకు కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాలని చెప్పుకొస్తున్నారు. మరి మేకర్స్ ఆ విధమైన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |