UPDATES  

NEWS

 అశ్వత్థామగా అమితాబ్.. ..

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే కనిపించనుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో బిగ్ బీకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.

 

కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించి గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అమితాబ్ బచ్చన్ గ్లింప్స్ చూస్తుంటూనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామనంటూ బిగ్ బీ తనని తాను పరిచయం చేసుకునే విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో అమితాబ్ అదురగొట్టారు. ఈ సినిమాలో అమితాబ్ కు సంబంధించిన కీలక అప్డేట్ రేపు రానుంది అంటూ మేకర్స్ శనివారం సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మేకర్స్ పోస్టర్స్, టీజర్ ను రిలీజ్ చేశారు. ఇవి ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకనున్నాయి.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |