UPDATES  

NEWS

 ‘పెద్ది’ వచ్చేది అప్పుడేనా…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత మరింత ముదురుతోంది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందనుకున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడి, జూన్ 26న విడుదల కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది.

 

తాజాగా ఓ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలతో ఈ వాయిదా ప్రచారానికి మరింత బలం చేకూరింది. తమ ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయాలనుకున్నామని, కానీ అదే తేదీన ‘పెద్ది’ వస్తుండటంతో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ దాదాపు ఖరారైనట్టేనని పలువురు భావిస్తున్నారు. అయితే, ‘పెద్ది’ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారని కూడా ఆయన చెప్పడం గమనార్హం.

 

ఈ గందరగోళం ఇతర సినిమాల షెడ్యూల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తుందని భావించి, అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26కు మార్చారు. ఇప్పుడు ‘పెద్ది’ జూన్‌కు వెళుతుందనే వార్తలతో ‘లెనిన్’ మళ్లీ పాత తేదీకే వస్తుందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఏప్రిల్ 30న ధనుష్ ‘కర’, కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కేడీ: ది డెవిల్’ వంటివి కూడా బరిలో ఉన్నాయి. ఈ మొత్తం అయోమయానికి ‘పెద్ది’ చిత్ర బృందం అధికారిక ప్రకటనతో ఎప్పుడు తెరదించుతుందోనని సినీ వర్గాలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |