UPDATES  

NEWS

 కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల.. .

కాంగ్రెస్ పార్టీ శనివారం 46 మంది లోక్‌సభ అభ్యర్థులతో నాల్గవ జాబితాను ప్రకటించింది. అందులో పార్టీ ప్రముఖుడు దిగ్విజయ సింగ్, నాయకులు అజయ్ రాయ్, కార్తీ పీ చిదంబరం ఉన్నారు.

 

రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు. దాదాపు 33 ఎళ్ళ తర్వాత దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ నుంచి పోటీ చేయనున్నారు. ఇంకా రెండేళ్ల రాజ్యసభ పదవీ కాలం ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకే అధిష్టానం మొగ్గు చూపింది.

 

పార్లమెంటు లోపల బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి నుంచి మతపరమైన దూషణలను ఎదుర్కొన్న బహిష్కృత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు డానిష్ అలీ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. ఇక కార్తీ పీ చిదంబరం తమిళనాడులోని శివగంగ ఎంపీ బరిలో నిల్చోనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |