UPDATES  

NEWS

 “గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం”.. పూనకాలు తెప్పిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మూవీ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. భగత్ బ్లాజ్ అనే పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఎన్నికల సమయం కావడంతో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జనసేన గుర్తు గ్లాజు గ్లాసుకు సంబంధించిన చెప్పిన డైలాగ్స్ ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

 

ఈ టీజర్ వీడియోలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తూ.. విలన్స్ కు మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. “గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది”, “కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం” అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ఊరమాస్ అనిపించేలా ఉన్నాయి. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్ కు జోడీగా మాస్ డ్యాన్స్, నటన, అందంతో ప్రేక్షకులను కేకపుట్టించే శ్రీలీల హీరోయిన్‍గా కనిపించనుంది. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉంది.

 

ఓ దేవాలయం వద్ద ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ కొందరు రౌడీలు విధ్వంసం చేస్తుంటారు. ఈ సీన్ తో ఉస్తార్ భగత్ సింగ్ బ్లేజ్ టీజర్ స్టార్ట్ అవ్వగా.. పవన్ ఆ రౌడీలను తన మాస్ స్టైల్ లో చితకబాదుతాడు భగత్ సింగ్. వెంటనే విలన్ పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ కు గాజు గ్లాసును చూపిస్తూ ‘నీ రేంజ్ ఇదీ’ అంటూ విలన్ రచ్చ రచ్చ చేస్తాడు. ఈ తర్వాత సీన్ లో “కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం” అనే పవన్ డైలాగ్ చెప్తాడు. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్.. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. ఇప్పుడు తాము మరింత బలమైన సైన్యంగా తయారయ్యామనేలా ఉంది.

 

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో అషుతోశ్ రాణా, నవాబ్ షా, బీఎస్ అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని మేకర్స్ ఇంతవరకు వెల్లడించలేదు.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |