UPDATES  

NEWS

 ‘రైట్స్’లో ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

RITES Recruitment 2023: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (Rail India Technical and Economic Service RITES) లో ఎలక్ట్రిక్, మెకానికల్ ఇంజినీర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

 

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (Rail India Technical and Economic Service RITES) లో ఎలక్ట్రిక్, మెకానికల్ ఇంజినీర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 18. ఈ లోపు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో rites.com వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. వీటిలో 23 ఎలక్ట్రికల్ ఇంజినీర్ (Electrical Engineer) పోస్ట్ లు, 31మెకానికల్ ఇంజినీర్ (Mechanical Engineer) పోస్ట్ లు ఉన్నాయి.

 

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 18. అప్లై చేసే అభ్యర్థుల వయస్సు ఈ మార్చి 1 నాటికి 40 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ (Electrical Engineer) పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ తదితర సంబంధిత విభాగాల నుంచి ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, మెకానికల్ ఇంజినీర్ (Mechanical Engineer) పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ లేదా సంబంధిత విభాగం నుంచి ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అదనంగా, కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ఉంటుంది. ఇందులో అనుభవానికి 5%, రాత పరీక్షకు 60%, ఇంటర్వ్యూకి 35% వెయిటేజీ ఉంటుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |