టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో సినిమాపై అంచనాలు ఏర్పడి ఉండటమే కాకుండా సినిమా సంచలనాలను సృష్టిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇక రాజమౌళి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటేనే ఈయన సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో స్పష్టమవుతుంది. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR సినిమా తర్వాత ఈయన మహేష్ బాబు(Mahesh Babu)తో వారణాసి (Varanasi)సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్ విడుదల చేయగా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
2027 లో విడుదల
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల మరొక వీడియో విడుదల చేస్తూ ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే వారణాసి విడుదల తేదీపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వారణాసిలో ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా పేరు వారణాసి కావడంతో వారణాసిలో ఏప్రిల్ ఏడవ తేదీ అని ఉన్న హోర్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది కచ్చితంగా వారణాసి సినిమా విడుదలకు సంబంధించిన తేదీ అంటూ అభిమానులు ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సినిమా పేరు లేకుండ హైప్ ఇచ్చిన జక్కన్న..
ఇక ఏప్రిల్ ఏడవ తేదీ విశేషం ఏంటి అనే విషయానికి వస్తే ఉగాది పండుగ కావడంతో పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారని భావించవచ్చు అయితే ఇక్కడ సినిమాకు సంబంధించి ఎలాంటి టైటిల్ లేదు, సినిమా లోగో కూడా లేదు కేవలం ఏప్రిల్ 7వ తేదీ అని మాత్రమే ఉంది. ఇక ఈ హోర్డింగ్ బ్యాక్ గ్రౌండ్ థీమ్ అలాగే కలర్ గ్రేడింగ్ వారణాసి సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్ ను పోలి ఉండడంతో ఇది కచ్చితంగా వారణాసి సినిమాకు సంబంధించిన విడుదల తేదీ అని అభిమానులు భావిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ప్రమోషన్ల విషయంలో రాజమౌళి తరువాతే ఎవరైనా..
ఇలా సినిమా పేరు లేకుండా లోగో లేకుండా సినిమాపై బజ్ క్రియేట్ చేయడం జక్కన్న పబ్లిసిటీ స్టంట్. ఈ సినిమా విషయంలో కూడా రాజమౌళి మార్క్ పబ్లిసిటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో అభిమానులు కూడా వారణాసి విడుదల ఏప్రిల్ ఏడవ తేదీ అంటూ ఫిక్స్ అయ్యారు. మరి నిజంగానే ఈ సినిమా ఏప్రిల్ ఏడవ తేదీ రాబోతోందా? లేదంటే మార్పులు చేర్పులు ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సినిమాని ప్రమోట్ చేయడంలో రాజమౌళి తరువాతనే ఎవరైనా అని చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా మహేష్ బాబు ప్రియాంక చోప్రాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.









