ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరును డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంటారని పోస్టులు వెల్లువెత్తాయి. గతంలో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత వ్యక్తిగత జీవితంపై వినిపిస్తున్న రూమర్లలో ఇది తాజాది.
ఈ రూమర్లకు బలం చేకూరుస్తూ, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి దేవి పరోక్ష వ్యాఖ్యలు (బరితెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అని) సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరూ తరచూ బయట కలుస్తుండటం, ‘ది ఫ్యామిలీ మాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టుల సమయంలో సాన్నిహిత్యం పెరిగిందన్న కథనాలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి.
సమంత గానీ, దర్శకుడు రాజ్ నిడిమోరు గానీ ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించకపోవడం నెటిజన్లలో సందేహాలను మరింత పెంచింది. ఈ వార్త నిజమా, లేదా కేవలం రూమరా అన్నది మాత్రం స్పష్టం కావాల్సి ఉంది. విడాకుల అనంతరం సమంత వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో ఉన్న ఆసక్తి కారణంగా ఈ వార్త దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.









