హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. విదేశీ పర్యటన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత హాజరును రికార్డు చేశారు.
-
కోర్టు హాల్‌లో జగన్ సుమారు ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారు.
-
న్యాయమూర్తి ఏమైనా చెప్పదలుచుకున్నారా అని అడగగా, ఆయన తరపు న్యాయవాది ‘నో’ అని బదులిచ్చారు.
-
హాజరు పూర్తయిన వెంటనే జగన్ కోర్టు నుంచి లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్లారు.
బెంగళూరుకు పయనం:
మధ్యాహ్నం 2 గంటల సమయంలో, జగన్ లోటస్ పాండ్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.
అభిమానుల స్వాగతం:
బేగంపేట ఎయిర్ పోర్టు వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు “సీఎం.. సీఎం” అంటూ నినాదాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Post Views: 31









