ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి వేడుకల్లో భాగంగా క్రాకర్స్ కాల్చుతూ సరదాగా గడిపిన సమయంలో ధరించిన షూలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. జగన్ మోహన్ రెడ్డి ధరించిన షూస్ మహిళలవి అంటూ కొందరు రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారాన్ని చేశారు. అయితే, ఇమేజ్ సెర్చ్ ద్వారా చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. ఇవి ‘Asics’ కంపెనీకి చెందిన రన్నింగ్ షూస్ అని, వాటిని ప్రత్యేకంగా పురుషుల కోసమే తయారు చేసినట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
జగన్ ధరించిన షూలు జపాన్‌కు చెందిన ప్రముఖ క్రీడా పరికరాల ఉత్పత్తి సంస్థ అయిన ASICS కార్పొరేషన్కు చెందినవి. ఈ కంపెనీ నాణ్యతకు, కంఫర్ట్‌కి ప్రసిద్ధి చెందింది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, జగన్ రెడ్డి ధరించిన ఈ షూల అసలు ధర సుమారు రూ. 10,999గా ఉంది. FF BLAST™ PLUS కుషనింగ్, FLUIDRIDE అవుట్‌సోల్ వంటి ప్రత్యేకతలు ఉండే ఈ న్యూట్రల్ ట్రైనర్.. రోజువారీ ఉపయోగానికి, రన్నింగ్‌కి అనుకూలంగా ఉంటుంది.
“Asics” అనే పేరు లాటిన్ పదజాలం “anima sana in corpore sano” (అర్ధం: “సంతులిత మనస్సు, సౌకర్యవంతమైన శరీరం”) నుంచి రూపొందించబడింది. ఈ సంస్థ రన్నింగ్ షూస్‌తో పాటు ఇతర పాదరక్షలు, వస్త్రాలు, బ్యాగులు వంటి క్రీడా సంబంధిత ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. జపాన్‌లోని కోబే, హ్యోగో ప్రిఫెక్చర్‌లో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది.









